
పశ్చిమ గోదావరి జిల్లా, ఉంగుటూరు మండలం, కాగుపాడు మరియు రావులపర్రు గ్రామం నుండి సుమారు 150 మంది జనసేనపార్టీ లోకి కండువా కప్పి ఆహ్వానించిన్న ఉభయగోదావరి జిల్లాల పార్లిమెంయిరీ కమిటీ సభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఆయన మాట్లాడుతూ రాజకీయం డబ్బుతో ముడిపడిన వ్యవస్థ అని రాజకీయలవైపు కన్నెత్తి చూడలంటేనే భయపడేవారిని సైతం ఎంతో మంది యువకులకు ఆవకాశం కల్పించిన పార్టీ జనసేన అని అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే యువతలో ప్రశ్నించేతత్వం రావాలని అప్పుడే అవినీతి జరగకుండా పారదర్శకంగా అభివృద్ది పనులు సక్రమంగా జరుగుతాయని తెలిపారు. నేటి వ్యవస్థ మార్పుకోసం జరుగుతున్న ఉద్యమాల్లో యువతరమే సింహాభాగంగా సాగుతుందని భావి భారత నిర్మాణం యువత చేతుల్లోనే ఉందని గుర్తుచేశారు. దేశానికి యువత ప్రధాన సంపద బలమైన ఆయుధం లాంటి వారని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అని అన్నారు. నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించి పరిష్కారం చెప్పేది ఒక్క జనసేన మాత్రమే అని ఆయన అన్నారు. మొన్న గ్రామ పంచాయితీ ఎన్నికల్లో జనసేన పార్టీ సాధించిన విజయాలు నిజాయితికి నిదర్శనం అన్నారు.









