కదిరి 34 వ వార్డు సమస్యలను జనసేన ఇంచార్జ్ భైరవ ప్రసాద్ కు విన్నవించిన సామాన్య ప్రజలు

కదిరి

       కదిరి టౌన్ ( జనస్వరం ) : 34 వ వార్డు నందు జనసేనపార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలతో ఆ వార్డు సమస్యలపై చర్చించడం జరిగింది. వారు మాట్లాడుతూ రోడ్లు, కాలువలు, వీధి దీపాలు లేవని, పాములు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయని, స్కూల్లో కూడా ఎక్కువగా చెట్లు, గడ్డి పెరిగి పాములు అక్కడ ఎక్కువగా ఉన్నాయని అన్నారు. దాని వలన చిన్న పిల్లలు బడికి వెళ్లాలంటే భయపడుతున్నారని అన్నారు. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని తెలియజేసారు. మీ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 6.11.2022 న మీవార్డు లో జనసేన… జనబాటకార్యక్రమం నిర్వహించి వార్డులో ఉండే సమస్యలపై మునిసిపల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్తామని, పరిష్కరించని పక్షంలో ధర్నాలు చేస్తామని కదిరి జనసేనపార్టీ ఇంచార్జ్ భైరవ ప్రసాదు తెలియజేయడం జరిగింది.

See also  లోకం మాధవి ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి చేరిన బంగారురాజుపేట గ్రామస్తులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి