విజయవాడ 52వ డివిజన్ లో ఆనందోత్సాహాలు

     విజయవాడ, (జనస్వరం)  : జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన జనసేన లీగల్ సెల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఇంట గెలిచి రచ్చ గెలవాలనే సూక్తితో ముందుగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం కార్యాలయం నుండి సమీక్ష నిర్వహించి, పశ్చిమ నియోజకవర్గంలో పోతిన వెంకట మహేష్ గెలవడానికి వ్యూహాలు ఇప్పుడు నుండే ప్రారంభిస్తామని తెలిపారు. ఈ సందర్బంగా పశ్చిమ నియోజకవర్గ జనసైనికులు పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పోతిన వెంకట మహేష్ కి అభినందనలు తెలియజేస్తూ 52వ డివిజన్ నాయకులు కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

See also  బుచ్చింపేట గ్రామ యువత ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు