పట్టణంలో ముగ్గురు జర్నలిస్ట్ లకు సంతాప సభ నిర్వహించిన పాత్రికేయులు

సత్తెనపల్లిలో జర్నలిస్టుల సంతాప సభ. ముగ్గురు పాత్రికేయులకు ఘన నివాళి.

సత్తెనపల్లి,జూన్ 07( జనస్వరం)

సత్తెనపల్లిలో సీనియర్ జర్నలిస్టు కేకే మూర్తి, యువ జర్నలిస్టులు టీవీ9 శ్రీనాథ్, సీవీఆర్ రాజశేఖర్‌ల మృతికి సంతాపంగా స్థానిక జర్నలిస్టులు సంతాప సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొని మృతి చెందిన సహచరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం రెండు నిమిషాల పాటు మౌనం పాటించి, వారి సేవలను స్మరించుకున్నారు. కేకే మూర్తి జర్నలిజం రంగంలో చూపిన నిబద్ధత, యువ జర్నలిస్టులు శ్రీనాథ్, రాజశేఖర్‌ల అంకితభావాన్ని గుర్తు చేసుకుంటూ పలువురు భావోద్వేగానికి గురయ్యారు.సంవత్సరం వ్యవధిలోనే ఇద్దరు జర్నలిస్టులను కోల్పోవడం పాత్రికేయ రంగానికి తీరని లోటని, వారి మరణం తీవ్ర వేదన కలిగించిందని తోటి జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.జర్నలిజం పట్ల అంకితభావంతో పనిచేసిన ఈ ముగ్గురు పాత్రికేయులు ఎప్పటికీ అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని సభలో పాల్గొన్న జర్నలిస్టులు పేర్కొన్నారు.

See also  ఏపి సెర్ప్ ఎంప్లాయిస్ అసోసియేషన్ పల్నాడు జిల్లా కార్యవర్గం ఎన్నిక