చిత్తూరు జిల్లాలో జనసేన, టిడిపి ఉమ్మడి అభ్యర్థులని గెలిపించాలి

చిత్తూరు

  మదనపల్లి ( జనస్వరం ) : కుప్ప‌ం‌ MM కళ్యాణ మండపంలో జనసేన – తెలుగుదేశం పార్టీల సంయుక్త సమావేశంలో మదనపల్లె జనసేన పార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి  దారం అనిత గారిని చంద్రబాబు నాయుడు అభినందించారు. జనసేన పార్టీ మదనపల్లి జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు ఆద్వర్యంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు కుప్పం తరలి వెళ్ళి చంద్రబాబు నాయుడుతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్, దారం అనిత గారిని ఆమె జనసేన పార్టీ బలోపేతానికి మదనపల్లెలో పనిచేస్తున్న విషయం చంద్రబాబు నాయుడు గారికి వివరించారు. 50% ఓటింగ్ ఉన్న మహిళలు జనసేనకు టిడిపికి అత్యంత శక్తి.. అత్యంత బలమని అలాగే ప్రతి కార్యక్రమంలోనూ ముందుండే మీలాంటి మహిళలు పార్టీకి పట్టుకొమ్మలు అని దారం అనిత గారిని చంద్రబాబునాయుడు గారు అభినందనలు తెలియజేశారు. జనసేన పార్టీ ఉమ్మడి‌ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించాలని సూచించారు.

See also  విషవాయువులు లీక్ అవ్వడంతో పీల్చి అస్వస్థతకు లోనైన వారిని పరామర్శించిన జనసేన నాయకులు