ఎచ్ఛర్ల నియోజకవర్గంలో జనసేనపార్టీలోకి కాంతి శ్రీ ఆధ్వర్యంలో చేరికలు

ఎచ్ఛర్ల

          ఎచ్ఛర్ల ( జనస్వరం ) : లావేరు మండలం కొత్తకోట పంచాయతీ.. YSRCP MPP (మండల ప్రెసిడెంట్) సొంత పంచాయితీలో దళిత కుటుంబాలకు చెందిన 40 మంది వ్యక్తులు జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలోకి కాంతి శ్రీ ఆధ్వర్యంలో జాయిన్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని కోరికతో ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు కాంతిశ్రీ గారి అధ్వర్యంలో జనసేన పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బలరాం , లావేరు మండల నాయకులు కాకర్ల బాబాజీ, బార్నల దుర్గారావు, రాజరమేష్, శేషగిరి నాయుడు, సత్య, సంజయ్, పవన్ కళ్యాణ్, నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.

See also  మద్దాలి గిరి , ముస్తఫా తమ శాసన సభ్యత్వానికి రాజీనామా చేయాలి : గుంటూరు అర్బన్ జనసేన పార్టీ డిమాండ్