చిలకం మధుసూదన్ రెడ్డి గారి సమక్షంలో జనసేన పార్టీలోకి చేరికలు

జనసేన

                ధర్మవరం ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలోకి చిలకం మధుసూదన్ రెడ్డి సమక్షంలో ధర్మవరం పట్టణంలోని వివిధ వార్డులకు సంబంధించి 50 కుటుంబాలు చేరడం జరిగింది. రామకృష్ణ, శంకర్, చంద్ర, వెంకీ, చరణ్, P. చంద్ర, లింగమయ్య, దేవా, హరికృష్ణ, ప్రసాద్, నరేష్, సుధాకర్, మహేంద్ర, ఇస్మాయిల్, మారుతి, శివయ్య, నారాయణస్వామి, గోవర్ధన్, ధనుంజయ తదితరులు పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలోకి చేరిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ కార్యకర్తల కోసం నిరంతరం అందుబాటులో ఉంటూ ఏ ఆపద వచ్చిన ముందు ఉంటానని హామీ ఇచ్చారు. అలాగే ప్రతి కార్యకర్త సైనికుడిలాగా పనిచేసి జనసేన పార్టీని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నిర్మిద్దామని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. 

See also  మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు