ఎచ్ఛర్ల నియోజకవర్గంలోకి వైసీపీ, టీడీపీ పార్టీల నుండి జనసేనలోకి చేరికలు

ఎచ్ఛర్ల

         ఎచ్ఛర్ల ( జనస్వరం ) : ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు కాంతిశ్రీ గారి అధ్వర్యంలో రణస్థలం మండలం నుంచి వైసీపీ, టీడీపీ పార్టీల నుంచి సుమారు 200 కుటుంబాలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్విని, రాష్ట్ర కార్యనిర్వహణ వైస్ ప్రెసిడెంట్ డా విశ్వక్షేణ్ జనసేనపార్టీ లోకి కండువాలు కప్పి ఆహ్వానించడం జరిగింది. వారు మాట్లాడుతూ వన్ కళ్యాణ్ గారి భావజాలాలు నచ్చి పార్టీలో చేరడానికి అనేకమంది ఆసక్తి చూపిస్తున్నారని అన్నారు. నేడు పార్టీలోకి చేరిన వారిలో అధికమంది యువత ఉండడం శుభపరిణామమని అన్నారు. పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తామని, రానున్న ఎమ్మెల్యే ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపిచ్చారు. ఈ కార్యక్రమంలో రాజాం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు ఎన్ని రాజు, జి.సిగడాం మండల నాయకులు మీసాల రవికుమార్, (సర్పంచ్ నిద్దాం) జనసేన నాయకులు కరిమజ్జి మల్లేశ్వరరావు, శ్రీ బలరాం, మధుబాబు, సువ్వాడ రామారావు, అప్పలనాయుడు, రెడ్డి వెంకటరమణ, సందీప్  జనసైనికులు నాయకులు పాల్గొన్నారు.

See also  ప్రకటించిన మద్దతు ధరకు ధ్యాన్యంను రైతుల వద్ద వెంటనే కొనుగోలు చేయాలంటూ జనసేన, బీజేపీ సంయుక్త ధర్నా