శివ కుటుంబానికి అండగా జనసైనికులు : రూ. 50,000 ఆర్థిక సహాయం

శివ కుటుంబానికి అండగా జనసైనికులు : రూ. 50,000 ఆర్థిక సహాయం

             విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలం, మర్రిపాలెం గ్రామానికి చెందిన తంపాల శివ అనే జనసేన కార్యకర్త గత వారం కిందట హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం, పిల్లల అవసరాలకు తమ వంతు సాయంగా జనసైనికులందరూ కలసి బుధవారం ఉదయం రూ. 50,000 వేలు నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో మోటూరి సన్యాసి నాయుడు, మామిడి శంకర్రావు, కర్రీ కనకరాజు, శరత్ కుమార్, రామానాయుడు, ప్రసాద్, తరుణ్, రవి, సురేశ్, ఎల్లాజి, అప్పల్రాజు, తదితర జనసైనికులందరూ పాల్గొని తమ వంతుగా సహాయం అందించారు. 88వ వార్డు వబ్బిన జనార్ధన శ్రీకాంత్ మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు ఆలోచనలు, ఆశయాలు ముందుకు తీసుకెళ్ళేందుకు 88 వ వార్డు పరిసర గ్రామాలలో ముందు ఉంటామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు పాల్గొన్నారు. 

See also  కిడ్నీ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త దాసరి రాజు