ఊడిమూడి గ్రామంలో పోలిశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రక్తదానం చేసిన జనసైనికులు

ఊడిమూడి గ్రామంలో పోలిశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రక్తదానం చేసిన జనసైనికులు

                రామచంద్రపురం నియోజకవర్గం గంగవరం మండలం ఊడిమూడి గ్రామం పంచాయతీ నందు ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా గ్రామ జనసైనికులు, గ్రామ పెద్దల సహకారంతో బ్లడ్ డొనేషన్ క్యాంప్ విజయవంతంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఊడిమూడి గ్రామ జనసైనికులు, పెద్దలు కేక్ కటింగ్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఇప్పటివరకు 43 సార్లు రక్తం దానం చేసిన సలాది విష్ణు గారిని రామచంద్రపురం జనసేన ఇంచార్జి శ్రీ పొలిశెట్టి చంద్రశేఖర్ గారు సన్మానించారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారు మరియు బిజేపి నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీ దూడల శంకరనారాయణ గారు, రామచంద్రపురం నియోజకవర్గం జనసేన నాయకులు గ్రామ పెద్దలు జనసైనికులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరం లో బ్లడ్ డొనేట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు రామచంద్రపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ పోలిశెట్టి చంద్రశేఖర్ గారు తెలియజేయడం జరిగింది .

See also  అఖిలపక్ష సమావేశంలో జనసేన పార్టీ నాయకులు