ప్రజా సంక్షేమమే జనసేన ధ్యేయం : కందుల నాగరాజు

కందుల నాగరాజు

        జనస్వరం ( జనస్వరం ) : ప్రజా సంక్షేమమే జనసేన ధ్యేయమని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. ఆయన ఆధ్వర్యంలో నియోజకవర్గంలో నిర్వహిస్తున్న పవనన్న ప్రజా బాట కార్యక్రమం 65వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, చేపడుతున్న కార్యక్రమాలు, కొనసాగిస్తున్న పోరాటాలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు. ప్రజలు జనసేన వెంటే ఉన్నారని చెప్పారు. అధికార పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. వచ్చే ఎన్నికలలో ఆ ప్రభావం కనిపిస్తుందని తెలిపారు. రానున్న ఎన్నికలలో జనసేన పార్టీ మెజార్టీ సీట్లు సాధిస్తుందని పేర్కొన్నారు. విశాఖలో కూడా జనసేన పార్టీ తన ప్రభావాన్ని చూపిస్తుందని వెల్లడించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో తాను చేపడుతున్న పవనన్న ప్రజా బాట కార్యక్రమానికి అనూహ్య స్పందన వస్తుందన్నారు. నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లిన ప్రజల నుంచి సాదర స్వాగతం లభిస్తుందన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వం మారితేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని భావిస్తున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల తర్వాత అధికార మార్పు జరగడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఆర్ నరేంద్ర కుమార్,రూప,సిహెచ్ ప్రసాద్, రాజు, సన్నీ, లక్ష్మి,శివ, శ్రీనివాస్, అంతోని శేఖర్, మంగ, కుమారి, దుర్గ, జానకి, రాజేశ్వరి, సునిత, దక్షిణ నియోజవర్గం యువ నాయకులు కేదార్నాథ్, బద్రీనాథ్ జనసేన నాయకులు, వీర మహిళలు పలువురు పాల్గొన్నారు.

See also  సేవలతోనే గుర్తింపు : జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి