చిత్తూరులో జనసేన జనస్వరం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ

చిత్తూరు, అక్టోబర్ 8, (జనస్వరం) : చిత్తూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నూతన సంవత్సర జనస్వరం క్యాలెండర్ 2026 ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం సరోజ్ కృష్ణ హోటల్‌లో అట్టహాసంగా నిర్వహించబడింది. జనసేన పార్టీ 19వ డివిజన్ ఇంచార్జ్ వనిత మురళి నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి చిత్తూరు నియోజకవర్గ POC ఆరని కవిత ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అలాగే చిత్తూరు జిల్లా సీనియర్ నాయకుడు శశికాంత్ పగడాలతో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించి, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో జనసైనికులు, వీర మహిళలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సాహంగా నినాదాలు చేశారు. ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని నిర్వాహకులు తెలిపారు.

See also  మదనపల్లి జిల్లా కొరకు JAC ఆధ్వర్యంలో నిరసన చేపట్టిన జనసేన నాయకులు