
జనసేనాని జన్మదినోత్సవ వారోత్సవాల సందర్భంగా నంద్యాలలో 100 యూనిట్లు రక్తదానం చేసిన జనసైనికులు
జనసేన అధినేత శ్రీ పవన్‌కళ్యాణ్‌గారి జన్మదిన వారోత్సవాలలో భాగంగా ఈరోజు కర్నూలు జిల్లాలోని నంద్యాలలోని బుక్కాపురంగ్రామంలో శ్రీ Y. విశ్వనాథ్‌గారి పర్యవేక్షణలో శ్రీ M. రామయ్య, శ్రీ మిద్దె శివ వారి మిత్రబృందం ఆధ్వర్యంలో స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శ్రీ చింతా సురేష్‌బాబుగారు మరియు ఆహ్వానితులుగా, బిజెపి నాయకులు శ్రీ బుడ్డా శ్రీకాంత్ రెడ్డిగారు, జనసేన ముస్లిం మైనార్టీ నాయకులు శ్రీ అర్షద్‌షేక్‌గారు శ్రీ K. శ్రీరాములు మరియు షాలుబాషగారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 100కు పైగా యూనిట్లను రక్తదాతలు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా సురేష్ బాబు చింత రక్తదాతలకు షీల్డులు బహూకరించి వారి సేవలను కొనియాడటం జరిగింది. అనంతరం మహానంది దేవస్థానంలో పవన్‌కళ్యాణ్ పేరున ప్రత్యేక పూజలు చేశారు. తదనంతరం నిర్వాహకులు జిల్లా జనసేననాయకులు శ్రీ చింతాసురేష్‌బాబుగారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బుక్కాపురం,తిమ్మాపూరం గ్రామప్రజలు మరియు జనసైనికులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల శ్రీ P. సుధాకర్ గారు కర్నూలు నుంచి జనసేన నాయకులు శ్రీ నాగేష్ అరిగెల, శ్రీ T. మంజునాథ్, శ్రీ కొండల్‌గారు,శ్రీ కస్తూరి భాస్కర్, శ్రీ ఆకెపోగు రాంబాబు, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.









