కదిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేనాని జన్మదిన వేడుకలు

కదిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనసేనాని జన్మదిన వేడుకలు

         కదిరి జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు కదిరి జనసేన పార్టీ ఇంచార్జ్ భైరవ ప్రసాద్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు . ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని తిమ్మమ్మ మర్రిమానులో జరిగిన కార్యక్రమంలో పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆడంబరాలకు దూరంగా జనసేన అధ్యక్షుడు జన్మదినాన్ని జరుపుకుంటున్నామని అందుకే ఆయన పుట్టిన రోజున ఏదో ఒక ప్రజా ఉపయోగకరమైన ఒక కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో చాలా సంవత్సరాలుగా ఎటువంటి రోడ్డు సదుపాయం లేని ఎన్ పి కుంట మండలం లోని వులింజల వారి పల్లి గ్రామానికి రోడ్డు లేనందువలన ఆ గ్రామానికి రోడ్డు ఏర్పాటు చేసుకునేందుకు ఆ గ్రామస్థులకు కొంత ఆర్థిక సహాయాన్ని అందించారు. అలాగే ఆ గ్రామస్తుల తో కలిసి స్థానిక జనసేన కార్యకర్తలు రోడ్డు ఏర్పాటు చేసుకొనుటకు సహాయపడగలరు అని దానికి ఇంకొంత ఆర్థిక సాయం అవసరమైతే అందజేస్తామని వారు తెలియజేశారు. ఈ గ్రామస్తులు ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్న మండల అధికారులు గాని ప్రజా ప్రతినిధులు గాని అటువైపు కన్నెత్తి చూడలేదు అని ఈ సమస్యను గత రెండు నెలల నుంచి మీడియా ముఖంగా తెలియజేస్తున్న ఎవరు పట్టించుకోలేదని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు. 

See also  ఐపిసి ని ప్రక్కన పెట్టి వైసీపీకి బానిసలుగా మారుతున్న జిల్లా అధికార, పోలీసు యంత్రాంగం : జనసేన పార్టీ నాయకులు ఆదాడ మోహనరావు