జొన్నాడ గ్రామంలో జనసేన కార్యవర్గ కమీటీ ఏర్పాటు

జొన్నాడ గ్రామంలో జనసేన కార్యవర్గ కమీటీ ఏర్పాటు

               కొత్తపేట నియోజకవర్గం జొన్నాడ గ్రామంలో జనసేన పార్టీ మీటింగ్ శ్రీ బండారు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరిగింది, మీటింగ్ లో జనసేన పార్టీ గ్రామ కార్యవర్గాన్ని, కమిటీ ని ఎన్నుకోవటం జరిగింది. గ్రామ జనసేన నాయకులు చెల్లె రాజశేఖర్, శివశంకర్ వరప్రసాద్, జొన్నాడ గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు గా ఎన్నుకోబడ్డ చింతలపూడి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఎన్నుకోబడ్డ జొన్నాడ శ్రీనివాస్ గార్లు మాట్లాడుతూ గ్రామంలో జనసేన బలోపేతానికి శాయశక్తులా కృషి చేసి వచ్చే ఎన్నికల సమయానికి 100% పార్టీ విజయానికి కృషి చేస్తామని, నీతిగా నిజాయితీగా అందరిని కలుపుకునీ కొత్తపేట నియోజకవర్గం లో బండారు శ్రీనివాస్ గారిని రాష్టంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వన్ని గెలిపించుకుంటామని వాగ్దానం చేయటం జరిగింది. ఈ కార్యక్రమం లో 30 మంది జనసైనికులు పార్టీ కండువా కప్పుకుని జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది.

See also  వాల్మీకి బోయల స్థితిగతుల అధ్యయనం కొరకు ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిటీని ఖండిస్తున్నాం : అనంత జనసేన నాయకులు