జనసేన వీరమహిళ భాగ్యశ్రీ గారికి కలిగిన పితృవియోగం, పరామర్శించిన జనసేన పార్టీ వీర మహిళలు

           జనసేన వీరమహిళ అయిన శ్రీమతి ఓగురి భాగ్యశ్రీ గారికి కలిగిన పితృవియోగం ,వారి తండ్రిగారు మాజీ మంత్రివర్యులు శ్రీ మోకా విష్ణు ప్రసాద్ గారు అనారోగ్యంతో స్వర్గస్థులయ్యారు. ఆయన సర్పంచ్ గా, ఎంల్ఏ గా, మార్కెటింగ్ మరియు గిడ్డంగులు శాఖ మంత్రిగా అనేక బాధ్యతలు చేపట్టి నియోజకవర్గానికి ఎన్నో సేవలను అందించారు. విష్ణు ప్రసాదరావు గారి హాయంలో  బడుగు, బలహీన వర్గాలకు అధిక సంఖ్యలో ఇండ్ల స్థలములు, పట్టాలు ఇప్పించటం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఏ ఎమ్మెల్యే కూడా ఈయన ఇచ్చినన్నీ ఇల్లు స్థలాలు ఇచ్చి ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈయన హాయములోనే ముమ్మిడివరంకు గవర్నమెంట్ ఆసుపత్రి, కోర్టు వచ్చాయి. మూరముళ్ల రాఘవేంద్ర వారధి నిర్మాణం జరిగింది. నియోజకవర్గానికి ఇన్ని మంచి పనులు చేసినా, అధిక సంఖ్యలో ఇల్లు పట్టాలు ఇప్పించినా ఎన్నడూ పబ్లిసిటీ కోసం పాకులాడలేదు. కనీసం ఈయన ఇళ్ల పట్టాలు పంచిన ఏ ఒక్క ప్రాంతానికి కూడా ఈయన పేరు పెట్టుకోలేదు అంటే అర్థం చేసుకోవచ్చు ఈయన ఎంత గొప్ప వ్యక్తో.. ఆయన పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మరియు భాగ్యశ్రీ గారికి వారి కుటుంబ సభ్యులకు వీరమహిళల తరుపునధైర్యం చెప్పి, ex-మేయర్ మరియు జనసేన రాష్ట్ర లోకల్ బాడీ ఎలక్షన్ కమిటీ సభ్యులు శ్రీమతి పోలసపల్లి సరోజ గారు, వీరమహిళలు ముత్యాల జయలక్ష్మి, పిళ్ళా రమ్యజ్యోతి, జగతా సత్యనందిని గార్లు శ్రద్దాంజలి ఘటించారు.

See also  అగ్నిప్రమాద బాధితులను అదుకున్న జనసేన నాయకులు గెడ్డం బుజ్జి