8 నెలల నుండి ప్రతి నెలా వృద్ధులకు నిత్యావసర సరుకులు అందిస్తున్న జనసేన వీర మహిళ డా. చుండూరి మల్లేశ్వరి

ప్రతి నెలా వృద్ధులకు నిత్యావసర సరుకులు అందిస్తున్న జనసేన వీర మహిళ డా. చుండూరి మల్లేశ్వరి

                  జనసేనాని శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్ఫూర్తితో ఎన్నో సేవా కార్యక్రమాలకు చేయూతనిచ్చే గొప్ప మనసున్న మనస్తత్వంతో, మానవత్వంతో డా. చుండూరి మల్లేశ్వరి గారు జనసేనకు తన సేవ చేస్తున్నారు. భీమవరంలో ఉన్న ఒక వృద్ధ దంపతులకు ప్రతినెల కావలసిన నిత్యావసర వస్తువులు,
అందిస్తున్నారు. 8 నెలల నుంచి నిత్యావసర వస్తువులు ఇవ్వడం విశేషం. ఎక్కడ సమస్య ఉందో, ఎక్కడ ఆకలి ఉందో, ఎక్కడ క్షోభ ఉందో అక్కడ జనసేన అండగా ఉండాలని సేనాని ఇచ్చిన పిలుపు మేరకు ఈ పేద తల్లిదండ్రులకు బాసటగా నిలిచారు. లాక్ డౌన్ ద్వారా ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈరోజు కూడా వాళ్లకి కావాల్సిన డిసెంబర్ నెలకి సరిపడా బియ్యం, ఇంట్లో కావాల్సిన నిత్యావసర సరుకులు డా. చుండూరి మల్లీశ్వరి గారు అందజేశారు.

See also  ఎన్ని ఏళ్ళు రోడ్ మరమ్మత్తు పేరుతో ఏప్రిల్ ఫూల్ చేస్తరు : ఆముదాలవలస జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి