
నెల్లూరు, (జనస్వరం) : నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమన్వయానికి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసూదన్‌రెడ్డి, పార్టీ కార్యదర్శులు శ్రీమతి గంటా స్వరూప, శ్రీ బేతపూడి విజయ్ శేఖర్ ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఈ త్రిసభ్య కమిటీ నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో జనసేన పార్టీ తరపున పోటీ చేయదలచిన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణతోపాటు పోలింగ్ వరకూ అన్ని వ్యవహారాలు సమన్వయపరుస్తుంది. దరఖాస్తుదారుల వివరాలను ఈ కమిటీ పార్టీ అధ్యక్షుల వారికి తెలియచేస్తుంది.








