
జనసేన టీమ్ జె. సి. ఎఫ్. ఆధ్వర్యంలో ప్రధాన రహదారికి మరమ్మతులు.
పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతంలో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ మెయిన్ గేట్ ఎదురుగా ఉన్న సెయింట్ జోసఫ్ స్కూల్ నుంచి ఇండస్ట్రీల్ కాలనీ, జనతా కాలనీ, సెయింట్ ఆన్ కాలేజీ, ఆసుపత్రి ప్రధాన రహదారిని చాలా సంవత్సరాలుగా ప్రజాప్రతినిధులు, అధికారులుకు ప్రజలు ఎన్ని సార్లు విన్నవించినా, అసలు పట్టించుకోని కారణంగా, రహదారి పెద్ద పెద్ద గోతులు పడి
పాదచారులు, ద్విచక్ర వాహనంపై ప్రయాణించే ప్రజలు తరచు ప్రమాదాలుకు గురి అవుతున్నారు. ఈ పరిస్థితి గమనించిన స్థానిక జె.సి. ఎఫ్. (జనతా కాలనీ ఫ్రెండ్స్) టీమ్ తమ స్వంత నిధులు ఖర్చుపెట్టి, జనసేన కార్యకర్తలు శ్రమదానంతో రహదారికి మరమ్మతులు చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 62వ వార్డు బిజెపి, జనసేన అభ్యర్థి ములకలపల్లి ప్రకాష్ హాజరయ్యారు. అనంతరం వారి చేతులు మీదుగా రహదారి మరమ్మతుల పనులు ప్రారంభించారు. ఈ పనులను జనసేన నాయుకులు శ్రీ శ్రీకాంత్, శ్రీ నగేష్, శ్రీ మనోహర్, శ్రీ పరమేష్, శ్రీ మణీoద్ర గార్లతో పాటు బిజెపి నాయుకుడు శ్రీ ములకలపల్లి ప్రకాష్ పనులను పర్యవేక్షించారు.








