జనసేన – తెదేపా అభ్యర్థి విజయమే లక్ష్యంగా పోరాటం

   పాలకొండ ( జనస్వరం ) : పాలకొండ నియోజకవర్గంలో (ఎస్టీ సవర) కులానికి చెందిన గిరిజన నేత నిమ్మల నిబ్రమ్ ని జనసేన – టీడీపీ సమన్వయకర్తగా నియమించడంతో, నియోజకవర్గంలో అత్యధిక శాతం సవరలు ఉన్నపటికీ ఇంతవరకు ఎ పార్టీ తగిన గుర్తింపు ఇవ్వలేదని జనసేన నాయకులు అన్నారు. జనసేన పార్టీ ఆ స్థానం ఇచ్చిందని అదేవిధంగా నియోజకవర్గంలో అన్ని వర్గాలను కలుపుకొని జనసేన పార్టీని మరింత పటిష్టపరిచేందుకు కృషి చేస్తామని జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్ మత్స. పుండరీకం తెలిపారు. అదేవిధంగా జనసేన పార్టీ – తెలుగుదేశం పార్టీల నాయకులను, కార్యకర్తలను, అభిమానులు సమన్వయం చేసుకుంటూ ఉమ్మడి కార్యాచరణని, మ్యానిఫెస్టోని ప్రజలలోకి తీసుకువెళ్తామని, రాబోయే ఎన్నికల్లో పాలకొండ నియోజక వర్గంలో ఉమ్మడి అభ్యర్థి ని గెలిపిస్తామని తెలిపారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు బి.పి.నాయుడు, కర్ణేన సాయి పవన్, జనసేన జాని, దండేల సతీష్, వావిలిపల్లి చిన్న, చరణ్, పండు, దత్తి గోపాల్, చింత గోవర్ధన్ తదితరులు జనసేన పార్టీ పాలకొండ నియోజకవర్గ బాద్యుడుగా నిమ్మల నిబ్రమ్ నియామకం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

See also  అడుగున గుంతలమయం సామాన్యుల ప్రయాణం నరకప్రాయం : వాసగిరి మణికంఠ