ప్రజా సమస్యలపై ఏలూరు 42వ డివిజన్ లో జనసేన పోరుబాట

     ఏలూరు, (జనస్వరం) : ప్రజా సమస్యలపై జనసేన పోరుబాటలో భాగంగా ఆదివారం స్థానిక 42వ డివిజన్ కొత్తపేటలో పాదయాత్రను నిర్వహించారు. ఈ సందర్బంగా నియోజకవర్గ ఇంచార్జ్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ కొత్తపేటలో రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదని, మంచినీటి కొరత తీవ్రంగా ఉందని, అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందడం లేదని, కుంటి సాకులు చూపించి అర్హులైన వృద్ధులకు వైసిపి ప్రభుత్వం పెన్షన్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అధికార పార్టీకీ ప్రత్యామ్నాయంగా ఏదైనా ఉందంటే అది జనసేనపార్టీ మాత్రమే అని, రాష్ట్రంలో జనసేనపార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రతి సమస్యపై స్పందించిన తీరు విధానంపై ప్రజలు ఆకర్షితులవుతున్నారన్నారు. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు దూషించుకోవడమే తప్ప ప్రజా సమస్యలపై దృష్టి సారించకుండా పాలనా యంత్రాంగం మరుగున పడేలా చేస్తున్నారని, రాష్ట్రంలో ఎటువంటి పరిశ్రమలు స్థాపన చేయకుండా కేవలం ప్రకటనలకే పరిమితం అవుతున్నారని, నిరుద్యోగులకు ఉపాధి కల్పన లేక పరాయి రాష్ట్రాలకు తరలి పోతున్నారని, ఒక పక్క సంక్షేమ పథకాలు ఇస్తున్నామని గొప్పలకు పోయి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నెట్టి వేస్తుందన్నారు. సంక్షేమ పథకాలు అమలు పరచాలంటే రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి జరగాలి కానీ ఏ ప్రక్కన చూసిన అప్పులే తప్ప ఆదాయం లేని రాష్ట్రంగా నిలిచిపోతుందని, మరో ప్రక్కన రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానాన్ని నిలబెడతానని చెప్పిన మాటను నిజం చేశారు. గంజాయి స్మగ్లింగ్ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉండడం జగన్ మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి అని రెడ్డి అప్పల నాయుడు ఎద్దేవా చేశారు.‌ ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

See also  కరోనా - ప్రకృతి - ఓ గుణపాఠం