
పంట నష్టపోయిన రైతులను పరామర్శించిన జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి మనుక్రాంత్
అకాల వర్షాల కారణంగా నష్టపోయిన పంటలను మరియు దళారీ చేతుల్లో ధగా కి గురవుతున్న రైతులను నష్టపోయిన కౌలు రైతుల ను కలిసి చెన్నారెడ్డి_మనుక్రాంత్ గారు పరామర్శించారు. నెల్లూరు రూరల్ కలివెలపాళెంలో కలెక్టర్ గారు ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా రైతులకు న్యాయం జరగలేదు. కనీస మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పాలి. పుట్టు కు 7,000 నుంచి 8 వేల రూపాయలు కూడా అందలేదు అని రైతులు వాపోతున్నారు. ఈ కారు రైతులు దారుణంగా నష్టపోయారు. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉందని మనుక్రాంత్ గారు అన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతులకు కౌలుదారులకు నష్టపరిహారం చెల్లించాలని మనుక్రాంత్ గారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి చెన్నారెడ్డి మనుక్రాంత్ గారు, గునుకుల కిషోర్, డాక్టర్ అజయ్, చప్పిడి శ్రీనివాస్ రెడ్డి, ప్రశాంత్ గౌడ్, కోట బాలాజీ, తిరుపతి బాలాజీ, షాజహాన్, సాయి తేజ తదితరులు పాల్గొన్నారు.









