
దర్శిలో జనసేనాని జన్మదిన వేడుకలలో వికలాంగురాలకు కుట్టు మిషన్ అందించిన జనసైనికులు
ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలను జనసేన కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు భారీ కేకును కట్ చేసి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని దర్శి కాప్స్ రాక్స్ టీమ్ వారు ఒక వికలాంగురాలికి కుట్టు మిషన్ ప్రధానం చేశారు. జనసైనికులు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించి పరిష్కారం చెప్పేది ఒక్క జనసేన
మాత్రమే అని ఆయన అన్నారు. పార్టీలతో, కులాలతో మతాలతో సంబంధం లేకుండా అందరికి సమాన్యాయం చేసేది ఒక్క జనసేన మాత్రమే అని చెప్పారు. కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు, కాప్స్ రాక్స్ టీమ్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే జనసేవలో భాగంగా పలు వృద్దఆశ్రమాలలో సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జనసేన నాయకులు షేక్ ఇర్శాద్, జడల వెంకటేశ్వర్లు, మహేష్, కోటి, సాయి, కొండ, సత్య, జనసేన కార్యకర్తలు, కాప్స్ రాక్స్ టీమ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.









