Logo
Date of Publish : 03 September 2020, 3:11 pm
Editor : Sake Naresh

దర్శిలో జనసేనాని జన్మదిన వేడుకలలో వికలాంగురాలకు కుట్టు మిషన్ అందించిన జనసైనికులు

దర్శిలో జనసేనాని జన్మదిన వేడుకలలో వికలాంగురాలకు కుట్టు మిషన్ అందించిన జనసైనికులు

               ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలను జనసేన కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు భారీ కేకును కట్ చేసి పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని దర్శి కాప్స్ రాక్స్ టీమ్ వారు ఒక వికలాంగురాలికి కుట్టు మిషన్ ప్రధానం చేశారు. జనసైనికులు మాట్లాడుతూ  నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించి పరిష్కారం చెప్పేది ఒక్క జనసేన మాత్రమే అని ఆయన అన్నారు. పార్టీలతో, కులాలతో మతాలతో సంబంధం లేకుండా అందరికి సమాన్యాయం చేసేది ఒక్క జనసేన మాత్రమే అని చెప్పారు. కార్యక్రమంలో దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు, కార్యకర్తలు, కాప్స్ రాక్స్ టీమ్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే జనసేవలో భాగంగా పలు వృద్దఆశ్రమాలలో సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జనసేన నాయకులు షేక్ ఇర్శాద్, జడల వెంకటేశ్వర్లు, మహేష్, కోటి, సాయి, కొండ, సత్య, జనసేన కార్యకర్తలు, కాప్స్ రాక్స్ టీమ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com