జనసేనాని జన్మదినోత్సవంలో భాగంగా కంచరపాలెం నియోజకవర్గంలో జనసైనికుల సేవా కార్యాక్రమాలు

జనసేనాని జన్మదినోత్సవంలో భాగంగా కంచరపాలెం నియోజకవర్గంలో జనసైనికుల సేవా కార్యాక్రమాలు

               జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి 49వ జన్మదిన వేడుకలు 56వ వార్డ్ కంచరపాలెం జనసైనికులు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. అనాధ పిల్లలకు భోజనం పంపిణీ చేసి ఆ తరువాత కేకు కటింగ్ చేయడం జరిగింది. జనసేన నాయకులు మాట్లాడుతూ  నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించి పరిష్కారం చెప్పేది ఒక్క జనసేన మాత్రమే అని ఆయన అన్నారు. పార్టీలతో, కులాలతో మతాలతో సంబంధం లేకుండా అందరికి సమాన్యాయం చేసేది ఒక్క జనసేన మాత్రమే అని చెప్పారు.     జనసేన పర్యావరణ సిద్ధాంతాలలో భాగంగా పర్యావరణాన్ని రక్షించడంలో భాగంగా వార్డ్ లో రామ్మూర్తి పంతులు పేట గ్రౌండ్ లో మొక్కలు నాటడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం కి ముఖ్య అతిధి గా నియోజకవర్గం నాయకులు పీలా రామకృష్ణ గారు, వార్డ్ ఉమ్మడి అభ్యర్థి బిశేట్టీ నారాయణ రావు(నాని) గారు,  బీజేపీ కార్యకర్తలు,  జనసైనికులు, తదితరులు పాల్గొన్నారు.

 

 

See also  రాజంపేట నియోజకవర్గ అభివృద్ధి పై YCP, TDP పార్టీల కపట ప్రేమ : కొట్టే శ్రీహరి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి