మంత్రి శంకర్ నారాయణపై ఫైర్ అయిన జనసేన రాప్తాడు ఇంఛార్జ్ పవన్ కుమార్

మంత్రి శంకర్ నారాయణపై ఫైర్ అయిన జనసేన రాప్తాడు ఇంఛార్జ్ పవన్ కుమార్.

 

జనసేన రాప్తాడు ఇంఛార్జ్ శ్రీ పవన్ కుమార్ గారు, రాష్ట్ర  మంత్రిగా ఉన్న శంకర్ నారాయణపై ధ్వజమెత్తారు.

  • 151 సీట్లు సంపాదించిన వైసీపీ ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ ఎవరితోనైనా ప్యాకేజీ తీసుకున్నాడు అని నిరూపిస్తే మేము రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, నిరూపించలేని యెడల మంత్రి శంకర్ నారాయణ గారు వారి మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా? ప్యాకేజీ తీసుకున్నాడు అని నిరూపించడానికి మీకు ఎంత సమయం కావాలో చెప్పవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం.

 

  • కరోనా సమయంలో సినిమాలు తీయడం మంచిది కాదని చెప్పిన వ్యక్తి మా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాంటిది ఆయన మీద విమర్శలు చేయడం తగదు.

 

  • మీరు ప్రజల కోసం చేసింది శూన్యం.  ప్రజల పక్షాన పోరాడి విజయాలు సాధించిన, ఓటమి తర్వాత కూడా పోరాడే సత్తా ఉన్న ఏకైక పార్టీ ఈ భారతదేశంలో ఏదైనా ఉందంటే అది జనసేన అని చెప్పడానికి మాకు చాలా గర్వంగా ఉంది. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్న ప్రజల పక్షాన పోరాడి నిలిచి వారి సమస్యలను తీర్చడంలో జనసేన పార్టీ ఎప్పుడూ ముందు ఉంటుంది.

 

  • జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో ప్రజా సమస్యలకు పరిష్కారం చూపిందో చెబితే మీరు మీ మంత్రి పదవికి రాజీనామా చేసి మా పవన్ కళ్యాణ్ గారికి దండం పెడతారు శ్రీ శంకర్ నారాయణ గారు.

 

  • మేము ఎన్నికల్లో అపజయం కావచ్చు కానీ మా పార్టీ మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సొంతంగా లీడర్లను తయారు చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. మేము ఓడిపోయాము అంతే గానీ, ఆగిపోలేదు.

మంత్రి శంకర్ నారాయణ గారు మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి కాదు. మీరు మంత్రిగా ఉండి బీసీలకు, అనంతపురం జిల్లా ప్రజలకు, రైతులకు మీరు ఏమి చేశారు? ఆ శాఖకు న్యాయం చేయలేకపోతే మీ ముఖ్యమంత్రి నీ శాఖనే మార్చారు. మీ స్థాయి ఏంటో తెలుసుకో పవన్ కళ్యాణ్ గారు సినిమా షూటింగ్ చేస్తున్నారో లేదో తెలుసుకోకుండా మిడిమిడి జ్ఞానంతో మాట్లాడడం మంచి పద్ధతి కాదు. జనసేన పనికిమాలిన సేన అని అంటున్నారు, ఇది మీకు తగదు. మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు విలువలతో కూడిన వ్యక్తి ఆయన్ని విమర్శించడం తప్ప, మీ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిది మేము కూడా మీలాగే మాట్లాడితే ముఖం ఎక్కడ పెట్టుకుంటారు. మీ పద్ధతిని, అలాగే మీ అదుపు తప్పి మాట్లాడితే తగిన రీతిలో ప్రజాస్వామ్య పద్ధతిలో మీకు బుద్ధి చెప్తామని జనసేన పార్టీ రాప్తాడు ఇంఛార్జ్ పవన్ కుమార్ గారు ఫైర్ అయ్యారు.

See also  ప్రమాదంలో మరణించిన జనసైనికుడు మునగాల రవి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన జనసేన గల్ఫ్ NRI సంస్థ