భగవాన్దాస్ పేటలో జనంకోసం జనసేన కార్యక్రమం

జనంకోసం జనసేన

     ఆముదాలవలస ( జనస్వరం ) : నియోజకవర్గం పొందూరు మండలం నందివాడ పంచాయతీ భగవాన్ దాస్ పేట గ్రామంలో ఆమదాలవలస నియోజకవర్గ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో జరిగింది. ఇంటి ఇంటికి వెళ్లి జనసేన పార్టీ సిద్దాంతాలు, షణ్ముఖ వ్యూహం, అధినేత కౌలు రైతులకి అండగా నిలబడే విధానం మరియు నియోజకవర్గంలో పార్టీ గెలిస్తే ప్రజల పక్షాన నిలబడి చేసే పనులు వివిధ అంశాలుతో కరపత్రం రూపంలో జనం కోసం జనసేన కార్యక్రమంతో వివరించారు. గ్రామంలో ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తాను అని హామీ ఇచ్చారు. ముఖ్యంగా గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న వాటర్ సమస్య, మరియు కాలువలు, రోడ్డు మరమ్మత్తులు అధికారంలోకి రాగానే తక్షణమే బాగు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఆయనతో పాటుగా నియోజకవర్గం నాయకులు పైడి మురళి మోహన్ , మండల నాయకులు యలకల రమణ, బాడితిమీని సింహాద్రి, రమేష్, పొన్నాడ బాలు, వసంత్ కుమార్, గణేష్, గోవింద, శ్రీ రామ్, దువ్వాడ దుర్గా సాగర్, కొలుసు కృష్ణ, B. రమణ, B అసిరయ్య మరియు పెద్ద ఎత్తున ఆ గ్రామ జనసైనికులు, తదితరులు పాల్గొన్నారు.

See also  జనసైనికులకు అండగా నిలిచిన దెందులూరు నియోజకవర్గ జనసేన నాయకులు కొఠారు ఆదిశేషు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి