జనసేనాని పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ పార్ట్ – 3

జనసేనాని పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ పార్ట్ – 3 

జనసేనాని చాలా రోజుల తర్వాత మన ముందుకు ఇంటర్వ్యూ ద్వారా వచ్చారు. ఒకసారి జనసేనాని మనసులోని మాటను తెలుసుకుందాం.

ప్రశ్న : జనసేన పార్టీ నిర్మాణానికి భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ?
జవాబు : ఒక కొత్త రాజకీయ వ్యవస్థను కోరుకున్న నేను నాకున్న అశేష అభిమాన జనంతో ఆరోజు హైదరాబాదులో పార్టీ స్థాపించడం జరిగింది. ఇపుడున్న పార్టీలు ఒక కులానికో, ఒక మతానికో ఆపాదించడం నాకు నచ్చదు. అందుకే జనసేన పార్టీని జాతీయవాద పార్టీగా, పాతికేళ్ళ భవిష్యత్తు కోసం, నవతరం యువకుల్ని తయారు చేయడానికి ఆ దిశగా ముందుకు వెళ్తూ పార్టీని మరింత బలోపేతం చేస్తాం. ఒక పార్టీ అన్నాక ఒడిదుడుకులు, కష్టాలు ఉంటాయి వాటిని దాటుకొని బలంగా ముందుకు వెళ్లడానికి ప్రయత్నం చేస్తాము. ఇప్పటి వరకూ 100 కు పైగా బలమైన అభ్యర్థులు ఉన్నారు, ఇంకా బలోపేతం చేస్తాం.

ప్రశ్న : మోడి గారు అధికారంలోకి వచ్చాక వెనుకబడిన ఆగ్రవర్ణాల కులాలకు రిజర్వేషన్లు కల్పిస్తే, రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని నీరు గార్చే విధంగా చేశారు అంటున్నారు. వీటి మీద మీ అభిప్రాయం ?
జవాబు : నేను చాలా పర్యటనల్లో వెళ్ళినపుడు చాలా మంది నన్ను వెనుకబడిన అగ్రవర్ణ కులాలు వారు ఆర్థికంగా వెనుకబడ్డాము, మాక్కూడా రిజర్వేషన్లు కల్పించాలని విన్నవించేవారు. ఇలాంటి రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినపుడు చాలా సంతోషం వేసింది. ఈ విషయంలో దేశమంతా హర్షించదగ్గ విషయం. ఈ రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వానికి మీరే నిర్ణయించుకోండి అని అవకాశం ఇవ్వగా, అప్పటి తెలుగుదేశ ప్రభుత్వం కాపు కులానికి 5% రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి అసెంబ్లీలో తీర్మానించి, ఆమోదం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. ఇక్కడ ఇవాల్సిన EBC రిజర్వేషన్లు కల్పించకపోగా, అటు కాపు రిజర్వేషన్లను కల్పించకపోగా నీరుగార్చారు.

ప్రశ్న : ఈ లాక్ డౌన్ కాలంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడి గారు ‘ ఆత్మ నిర్భర భారత్ ’ కు 20 లక్షల కోట్లు ప్రకటించారు. ఇది అభివృద్ధికి ఎలా ఉపయోగపడుతుందని అనుకుంటున్నారు ?
జవాబు : కేంద్ర ప్రభుత్వం ఈ కరోనా లాక్ డౌన్ కాలంలో ఈ ‘ ఆత్మ నిర్భర భారత్ ’ పథకం ద్వారా 20లక్షల కోట్లు ప్రకటించడం బాధాకరం. అయితే ఇక్కడ ప్రతిపక్షాలు ఎలా చూస్తున్నాయి అంటే నా వాటా కింద ఎన్ని లక్షలు వచ్చాయి, సామాన్యుడికి ఎంత డబ్బులు ఇస్తున్నారు అని అవివేకతనంతో మాట్లాడడం హాస్యాస్పదం. ఈ లాక్ డౌన్ కాలంలో ప్రజలు ఆర్థికంగా వెనుకబడిపోయారు. వారికి బ్యాంక్ ద్వారా రుణాలు అందించి ఉపాధి కల్పించి తద్వారా, వారు ఆర్థికంగా మెరుగు అవ్వాలనేది లక్ష్యం.

See also  అంధకారంలో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపించేది జనసేన, టిడిపి

ప్రశ్న : ఈ మధ్య కాలంలో చైనాతో యుద్ధమేఘాలు కమ్ముకునే పరిస్థితి దాకా వచ్చింది. దీని మీద మీ అభిప్రాయం ఏమిటి ?
జవాబు : మా నాన్న ఆస్తికలను త్రివేణి సంగమంలో కలపడానికి వెళ్ళిన ఆ సమయంలోనే ముంబై లో దాడులు జరగడం, అలాగే దేవాలయం లాంటి పార్లమెంట్ మీద దాడి జరగడం నాకు బాధ అనిపించింది. అలాంటి సంఘటనలు జరిగినప్పుడు వీటిని బలంగా ఎదుర్కొనే బలమైన నాయకులు దేశానికి అవసరం అనిపించింది. అపుడు నాకు మదిలో మోడి గారు ఒక బలమైన నాయకుడిగా అనిపించారు. ఈ రోజు చైనా కవ్వింపు చర్యలు చూస్తే నాకు చిన్నప్పటి పాఠ్యపుస్తకాలు గుర్తొచ్చాయి. వాటిలో మన దేశ భూభాగాన్ని వాళ్ళు లాక్కున్నారు, వీళ్ళు లాక్కున్నారు అనే ఉంటుంది. మనం కూడా పోరాటం చేయొచ్చు కదా వాళ్ళ దేశాల మీద అనే ఆవేశం గల తరం నుంచి వచ్చాము. సరస్సులో ఉన్న మొసలిని నమ్మోద్దు, చైనాలో ఉన్న చైంఘీలను నమ్మోద్దు అని బాలగంగాధర్ తిలక్ చెప్పిన ఆవేశం గుర్తొచ్చింది. ఇలాంటి సమయాల్లో వారిని తిప్పి కొట్టడానికి ఒక బలమైన నాయకత్వంగా మోడి గారు గుర్తొస్తారు. ప్రపంచ దేశాలతో దౌత్య సంబధాలను పెంచుకోవడం కూడా ఒక బలమైన కారణం. బలమైన ఆర్థిక, ఆయుధ సంపద కలిగిన చైనా ను భయపెట్టడం అంటే చాలా చిన్న విషయం కాదు. ఈ రోజు మోడి గారి ధైర్య నిబద్ధత వల్ల దేశం మొత్తం గర్విస్తోంది.

ప్రశ్న : వృత్తి ఆధారిత, ఉపాధి సంబధిత వారు, చేతివృత్తి కలిగిన వారు ఆదాయాన్ని కోల్పోవడం, వీటికి ముగింపు పలకాలంటే ఏం చర్యలు తీసుకోవాలి ?
జవాబు : మనదేశం వృత్తి ఆధారిత కులాలతో కూడిన సమాజం మనది. నేను ఎమ్మిగనూరులో వస్త్రాలు కనుగోలు చేసినప్పుడు వారు నాతో చెప్పిన విషయం ఏంటంటే మాకు చేనేత ఆదాయ వనరు కల్పించాలని కోరారు. భవన నిర్మాణానికి ముడిసరుకు లాంటి ఇసుక అందుబాటులో లేనప్పుడు భవన నిర్మాణ కూలీలకు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వ విధానాల వల్ల ఇసుక అనేది అందని ద్రాక్షలా తయారయ్యిందని పార్టీ నాయకులు కూడా నాతో విన్నవించారు. ఇసుక మాఫియా కూడా ఈ ప్రభుత్వంలో పెట్రేగిపోతుందని అర్థం అవుతోంది. స్వర్ణకారులు కూడా నాతో చెప్పింది ఏంటంటే కార్పొరేట్ ఆభరణాల షాపులు రావడం వల్ల మా పరిస్థితి దారుణంగా తయారు అయ్యిందని ఆవేదన చెందారు. ప్రభుత్వం విధానపరమైన పాలసీలు తీసుకుంటే చెల్లాచెదురైన వీరిని ఆదుకోవచ్చు. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

See also  రాష్ట్ర పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం అభిమానుల ఆత్మీయ సమావేశం

ప్రశ్న : మీ రాబోయే సినిమాల గురించి ఏమైనా చెప్పగలరా ?
జవాబు : ఇపుడున్న పరిస్థితుల్లో సినిమాలు తీసే పరిస్థితి లేదు. ప్రభుత్వాలు షూటింగ్స్ కు అనుమతి ఇచ్చినప్పటికి నిర్వహించలేని పరిస్థితి. ఈ కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ వచ్చి కాస్తాయినా కుదుటపడితే తప్ప షూటింగ్ లు నిర్వహించలేము. అమితాబ్ బచ్చన్ గారికి కూడా కరోనా రావడం కూడా చూసాము.

ప్రశ్న : ఈ లాక్ డౌన్ కాలంలో మీ పార్టీ జనసైనికులు చేసిన సహాయం చూస్తే మీకు ఏమి అనిపిస్తుంది ?
జవాబు : ఈ కరోనా లాక్ డౌన్ కాలంలో జనసైనికులు మనస్ఫూర్తిగా స్పందించి జనసేవ చేయడం నాకు హృదయాన్ని కదిలించింది. ఒక కేజీ కాయగూరల నుంచి ఒక దేశం నుండి ఇక్కడికి స్వదేశీయులను తీసుకు రావడానికి 2 విమానాలను ఏర్పాటు చేసేంత సాయం చేయడం నాకు చాలా గర్వంగా అనిపించింది. మనస్ఫూర్తిగా జనసైనికులను అభినందిస్తున్నాను.సమాజంలో ఒక వ్యక్తిని అభినందించి ఇంతలా సేవ చేయడం నాకు ఆనందాన్ని ఇచ్చింది. కేవలం మన స్వార్థం కోసమో కాకుండా, మన కుటుంబం కోసమో కాకుండా సమాజం కోసం ఇంతగా తపించి సేవ చేసిన ప్రతి జనసైనికునికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఇలాంటి జనసైనికులు నాకు చాలా గర్వకారణం. ఇలాంటి సేవలే భవిష్యత్తులో పార్టీ నిర్మాణానికి బలంగా దోహదపడుతాయి. ఇంత ఓటమి తర్వాత కూడా స్థానికంగా తమ సమస్యలను వెలికితీసి పరిష్కారం దిశగా పని చేయడం నాకు ఆనందాన్ని ఇస్తోంది. ఇలాంటి జనసైనికుల కోసమైనా నేను బలంగా పార్టీ కోసం నిలబడతా.

పవన్ కళ్యాణ్ జనసేనాని ఇంటర్వ్యూ పార్ట్ – 2 PDF లో డౌన్లోడ్ చేసుకోండి. 

Download