
విజయవాడ, (జనస్వరం) : ప్రముఖ వయోలిన్ విద్వాంసులు అన్నవరపు రామస్వామికి భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డు పొందిన సందర్భంగా జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ విజయవాడలోని వారి స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి పోతిరెడ్డి అనిత రమణ, జిడగం. శ్రీనివాస్ మహాలక్ష్మి, చందు శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.








