
జనసేన పార్టీ తెలంగాణ ఇంచార్జ్ శ్రీ శంకర్ గౌడ్ గారిని కలిసిన తెలంగాణ రాష్ట్ర 26 బీసీ కులాల JAC
బీసీ జాబితా నుండి తొలగించిన 26 కులాలను వెంటనే కలపాలనే డిమాండ్ తో ఏర్పాటైన జాయింట్ యాక్షన్ కమిటీ జనసేన పార్టీ తెలంగాణ ఇంచార్జ్ శ్రీ శంకర్ గౌడ్ గారిని కలిశారు. 6 సంవత్సరాల క్రితం బీసీల జాబితా నుండి తొలగించిన కులాలను ఎన్నికలు వచ్చిన ప్రతీ సందర్భంలో తిరిగి కలుపుతామనే వాగ్దానాలు ఇస్తూ మభ్యపెట్టి మోసం చేస్తూనే ఉన్నారని, 2015లో ముఖ్యమంత్రి KCR గారు, 2018లో KTR కూడా అసెంబ్లీ ఎన్నికల తరువాత కలుపుతామని హామీ ఇచ్చారని, రెండేళ్ళు గడిచినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసి తమకు తగిన న్యాయం చేయాలని JAC నాయకులు శ్రీ ఆళ్ల రామకృష్ణ, PVV సత్యనారాయణ, చిత్తూరి వేణు, ఇతర సభ్యులు కోరారు. వారి విజ్ఞప్తికి స్పందిస్తూ, ఖచ్చితంగా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్తానని JAC సభ్యులకు తెలియజేయడం జరిగింది.








