వార్డ్ తిరస్కరణపై అభ్యంతరం వ్యక్తం చేసిన జనసేన పార్టీ టెక్కలి ఇంచార్జ్ కణితి కిరణ్

             సంతబొమ్మలి మండలం ఉమ్మిలాడ పంచాయతిలో జనసేన పార్టీ తరుపున 7వ వార్డ్ మెంబర్ గా నామినేషన్ వేసిన బర్రి రాజేశ్వరి నామినేషన్ ఇంటి పన్ను రసీదు సమర్పించని కారణంగా రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. విషయం తెలుసుకున్న జనసేన టెక్కలి ఇంచార్జ్ కణితి కిరణ్ తోటి జనసైనికులతో టెక్కలి జాయింట్ కలెక్టర్ సుమిత్ గారిని స్థానిక ఆర్డీవో ఆఫీస్ నందు కలసి తమ అభ్యర్థికి సొంత ఇల్లు లేని కారణంగా తను ఇంటి పన్ను రసీదు సమర్పించలేదని తెలిపి తమ అభ్యర్థి నామినేషన్ ను పునఃపరిశీలించి నామినేషన్ ను అంగీకరించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో తమ లాయర్ అనుపల్లి రామారావు, జనసేన నాయకులు పూర్ణ చంద్ర, మూగి శివ, రాంప్రసాద్, సతీష్, చంటి, సాయి, స్వాదీన్ పాల్గొన్నారు.

See also  యువశక్తి పోస్టర్లను ఆవిష్కరించిన ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ రేఖా గౌడ్