విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై VMC గారిని కలిసి వినతిపత్రం ఇచ్చిన జనసేనపార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్

   విజయవాడ, (జనస్వరం) :  పశ్చిమ నియోజకవర్గంలో ప్రధాన రహదారి చిట్టినగర్‌ నుండి నెహ్రూ బొమ్మ సెంటర్‌ వరకు రోడ్డు పూర్తిగా పాడైపోయి అధ్వాన్న స్థితిలో ఉన్నది అనేక సందర్భాల్లో అధికారులు కూడా ఈ అంశాన్ని తెలియజేసినాము కానీ ఇంత వరకు కనీస మరమ్మతులు కూడా నోదుకోలేదు తమరు ఈ ప్రధాన రహదారిని పరిశీలించి నూతన రోడ్డు నిర్మాణం చేపట్టి ప్రజల ఇబ్బందులను తొలగించగలరు అని కోరుతున్నాము. విలువైన కార్పొరేషన్‌ స్థలాలను ఫౌండేషన్‌ పేరిట మంజూరు చేయవద్దని కోరుతున్నాము ఎర్రకట్ట వద్ద గల పార్క్‌ స్థలంలో వెల్లంపల్లి ఫౌండేషన్‌ పేరుతో కమ్యూనిటీ హాల్‌ నిర్మాణం చేసినారు. దీనికి కార్పొరేషన్‌ వారు ఎస్టిమేషన్‌ గాని, నిర్మించుటకు అనుమతులు గాని, ఇంజినీరింగ్‌ విభాగం అనుమతులు గాని, లేవని చెబుతున్నారు. కావున తమరు దయవుంచి ఈ అంశాన్ని కూడా పరిశీలించగలరు. ఇక్కడ ఏర్పాటు చేసిన కమ్యూనిటీ హాల్‌కు VMC వారి పేరును జత చేస్తూ అంబేద్కర్‌ గారి పేరును లేదా బాబు జగ్జీవన్‌ రామ్‌ గారి పేరును నామకరణం చేయవలసిందిగా కోరుతున్నాము. పశ్చిమ నియోజకవర్గం లోని అనేక ప్రాంతాల్లో చిన్నపాటి వర్షానికి ముంపునకు గురవుతున్నాయి అందుకు పరిష్కార దిశగా అవుట్‌ ఫోలో డ్రాయిన్‌ నిర్మాణం చేపట్టాలని మరియు అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులను కూడా ప్రారంభించి పూర్తి చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాం.పేద సామాన్య వర్గాల కలయిన సొంత ఇళ్లను టిడ్కో పధకం ద్వారా ప్రభుత్వాలు సాకారం చేసే దిశగా ముందుకు వెళుతున్నాయి. జక్కంపూడి ప్రాంతంలో నిర్మించిన ఇళ్లను తక్షణమే పూర్తిచేసి లబ్ధిదారులకు కేటాయించేలా తమ చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమములో జిల్లా ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

See also  గాతపాడు గ్రామంలో రోడ్డు సదుపాయం కల్పించాలి? అరకు జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి