
ధర్మవరం, (జనస్వరం) : ఈ రోజు ధర్మవరంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసుధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి అనంతపురం జిల్లా అధ్యక్షులు శ్రీ T.C వరుణ్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ పత్తి చంద్రశేఖర్ విచ్చేసారు. అనంతరం వారు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం గురించి మాట్లాడుతూ పార్టీ నాయకులకు మరియు కార్యకర్తలు ప్రతి ఒక్కరు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకోవాలని కోరడం జరిగింది. అలాగే మార్చి 14వ తేదీన ఆవిర్భావ సభకు ధర్మవరం నియోజకవర్గం నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్స్, జిల్లా కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.









