శ్రీకాళహస్తిలో టీడీపీ పార్టీ చేస్తున్న దీక్షకు జనసేనపార్టీ సంఘీభావం

శ్రీకాళహస్తి

     శ్రీకాళహస్తి ( జనస్వరం ) : ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బీసీ సంఘం నాయకులు, టీడీపీ ఇంఛార్జి బొజ్జల సుధీర్ రెడ్డి చేస్తున్న నిరసన దీక్షచేపట్టారు. టీడీపీ నేతల ఆహ్వానం మేరకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి వినుత కోటా, జనసేన నాయకులు, జనసైనికులతో వెళ్లి దీక్షలో పాల్గొని జనసేన పార్టీ తరపున సంఘీభావం తెలపడం జరిగింది. శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు దండి రాఘవయ్య, శ్రీకాళహస్తి పట్టణ ఉపాధ్యక్షుడు తోట గణేష్, నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ కావాలి శివకుమార్ ,ప్రధాన కార్యదర్శులు పేట చిరంజీవి, ముడుసు గణేష్, పేట చంద్ర శేఖర్, నితీష్ కుమార్ నాయకులు వెంకటరమణ యాదవ్ , దినేష్, అరుణ్ రెడ్డి, తులసీ రామ్ , సింగమల గోపి , చందు యాదవ్ జనసైనికులు పాల్గొన్నారు.

See also  సంక్రాంతి పండుగ రోజున ధర్మవరం నియోజకవర్గంలో జనసేనపార్టీలోకి చేరికలు