నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలలో జనసేన పార్టీ నుండి మొత్తం 54 వార్డులలో పోటీ చేయడానికి సిద్దంగా ఉన్నాం – జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్

      నెల్లూరు, (జనస్వరం) :  నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్న సందర్భంగా జిల్లా జనసేన పార్టీ ఇంఛార్జ్ మనుక్రాంత్  పార్టీ కార్యాలయంలో విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మనుక్రాంత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు, అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కరెంటు ఛార్జీలు, డీజల్,పెట్రోల్, గ్యాస్ రేట్లు పెరిగిపోయాయి. రోడ్ల దుస్థితి మరీ దారుణంగా ఉంది. రైతులకు గిట్టుబాటు ధరలు లేవు. యువకులకు ఉపాధి అవకాశాలు లేవు. మన నెల్లూరులో అయితే ఇంటి పన్ను, నీళ్ల పన్ను, చెత్త పన్ను అని ప్రజల నుండి ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నారు. జనసేన పార్టీ ప్రజల కోసం నిరంతరం పోరాడుతూ ఉంటుంది. సెప్టెంబర్ 2,3,4 వ తేదీన రోడ్ల దుస్థితి గురించి ఎన్నో కార్యక్రమాలు చేసాం. జగన్ గారికి ప్రజల కష్టాలు కనిపించడం లేదు. వీటన్నింటిని గమనించిన ప్రజలు రాబోయే నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తారు. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ అన్నీ చోట్ల పోటీ చేస్తుందని ఆయన అన్నారు. కచ్చితంగా ఎక్కువ సీట్లు గెలవబోతున్నాం. ఎందుకంటే ఎంతోమంది ప్రజలు జనసేనపార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వెళ్తే ఏ సమస్య అయినా తీరుతుంది అనే నమ్మకం ప్రజల్లో గట్టిగా ఏర్పడింది. జనసేన పార్టీ 2024 లో కచ్చితంగా అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఉంది.అలాగే జనసేన పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు నచ్చి ఎంతో మంది పార్టీలో చేరుతున్నారని ఆయన పేర్కొన్నారు. జనసేన పార్టీ నెల్లూరుకి ఏం చేయబోతున్నామో చెప్పి, ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజలకు వివరంగా చెప్పి ప్రజల మనసులను గెలుస్తాం. నిస్వార్థంగా, నిజాయితీగా పనిచేసే ఏకైక పార్టీ జనసేన పార్టీ. భారీ స్థాయిలో విస్తృతంగా ప్రచారం కూడా మొదలపెట్టాము అని ఆయన తెలిపారు.

See also  యువశక్తి కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించిన JSP గ్లోబల్ టీం సభ్యులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి