విజయవాడ 48వ డివిజన్‌లో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం

● ముఖ్య అతిథిగా రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి పోతిన వెంకట మహేష్‌
       విజయవాడ, (జనస్వరం) : స్థానిక 48వ డివిజన్‌లో జనసేనపార్టీ కార్యాలయాన్ని గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధికార ప్రతినిధి, విజయవాడ నగర అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి పోతిన వెంకట మహేష్‌ హాజరై రిబ్బన్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా పోతిన వెంకట మహేష్‌ మాట్లాడుతూ జనసేన పార్టీ ప్రజలకు ఎల్లావేళలా అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ తరుణంలోనే 48వ డివిజన్‌లో కార్యాలయాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని ఆదేశించారు. అనంతరం డివిజన్‌ అధ్యక్షుడు కొరగంజి వెంకటరమణ మాట్లాడుతూ ఈ మూడేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిని పక్కన పెట్టేసిందని, సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తుందని ఎద్దేవా చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌ నియోజకవర్గానికి చేసింది ఏమి లేదని అవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యక్షుడు మారుపిళ్ళ సింహచలం మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ అధికారం చేపట్టిన తర్వాత నిత్యావసర ధరలు అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. సంయుక్త కార్యదర్శి సుభాని మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే జనసేన పార్టీ అధికారంలోకి రావాలన్నారు. నగర కార్యదర్శి వేమిన నాగరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు పవన్‌ కల్యాణ్‌తోనే మేలు జరుగుతుందని, జనసేనను నమ్మి ఓట్లు వేసి అధికారంలోకి తీసుకురావాలన్నారు. ధార్మిక సేవ సభ్యులు తమ్మిన రఘు మాట్లాడుతూ జనసేన పార్టీ ప్రజలకు అండగా నిలబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలిశెట్టి ఉమామహేశ్వరరావు, దిండి నాని, దాసిన జగదీష్‌ , పవన్‌ కల్యాణ్‌, పి.దుర్గారావు, ఎస్‌.శ్రీను, పైల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

See also  జగన్‌ అవినీతిని... అసమర్ధతను నడ్డా వివరించాలి : జనసేన నాయకులు పోతిన వెంకట మహేష్