విజయనగరంలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం

విజయనగరంలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం

                   విజయనగరం నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయాన్ని బాలాజీ నగర్ లో (హిమగిరి సప్తగిరి థియేటర్ ఎదురుగా) బుధవారం మధ్యాహ్నం జనసేన పార్టీ విజయనగరం ఇంచార్జ్, జనసేన పొలిటికల్ ఎఫ్ఫైర్స్ కమిటీ సభ్యురాలు శ్రీమతి పాలవలస యశస్వి గారు ప్రారంభించారు. కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం విలేకరులతో యశస్వి గారు మాట్లాడుతూ జనసేన పార్టీని మరింత బలోపేతం దిశగా తీసుకెళ్లేందుకు ఈపార్టీ కార్యాలయం కేంద్రబిందువు అవుతుందని, జనసైనికులకు మరింత అండగా ఉంటూ వారికి భరోసా కల్పిస్తామని, ఈ కార్యాలయం నుండే భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించి జనసేన బీజేపీ కూటమితో రానున్న స్థానిక పురపాలక ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేస్తామని అన్నారు. ప్రారంభోత్సవానికి అతిధిలుగా విచ్చేసిన బీజేపీ నాయకులు శ్రీ కుసుమంచి సుబ్బారావు గారు మరియు శ్రీ పాకలపాటి మురళి గారు విచ్చేసి వారు మాట్లాడుతూ జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా పాలవలస యశస్వి గారికి మరియు జనసైనికులకు శుభాకాంక్షలు తెలుపుతూ త్వరలోనే విజయనగరం నియోజకవర్గ పరిధిలోని ప్రజలందరికి ఓ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ప్రభుత్వం అందించాల్సిన మౌలిక సదుపాయాల సమస్యలు పరిష్కరించాలని నిర్ణయించామన అన్నారు. జనసేన, బీజేపీ కూటమితో కలసి ప్రజాసమస్యలపై పోరాడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన ఝాన్సీ వీరమహిళలు శ్రీమతి ముదిలి సర్వమంగల గారు, శ్రీమతి గంట్లాన పుష్పకుమారి గారు, శ్రీమతి గాయత్రీ గారు, జనసేన సీనియర్ నాయకులు శ్రీ ఆదాడ మోహనరావు గారు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు, త్యాడ రామకృష్ణారావు(బాలు), జనసేన కార్పొరేట్ అభ్యర్థులు వంకర సురేష్, లోపింటి కళ్యాణ్, కిలారి ప్రసాద్, రౌతు సతీష్, ఏంటి రాజేష్, హుస్సేన్ ఖాన్, శ్రీ వంక నరసింగరావు గారు, జనసేన నాయకులు రవిరాజ్ చౌదరి, రవితేజ, యర్నాగుల చక్రవర్తి, దినేష్, వేణు, వెంకటేష్, రామకృష్ణ, పలువురు బీజేపీ జనసైనికులకు పాల్గొన్నారు. 

See also  కరోనా కష్టకాలంలో యూజీసీ పరీక్షలు పెట్టడం సబబు కాదు... నెల్లూరు జనసేన నాయకులు గునుకుల కిషోర్