మాడుగలలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం, పార్టీలోకి 200 మంది చేరిక

మాడుగల

    మాడుగుల, (జనస్వరం) :  జనసేన పార్టీ మాడుగుల నియోజకవర్గ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకరరావు గారు, రాష్ట్ర కార్యదర్శిలు శ్రీ బోడపాటి శివదత్, శ్రీమతి దుర్గా ప్రశాంతి పాల్గొన్నారు. ఈ సందర్బంగా శ్రీ శివ శంకరరావు గారు మాట్లాడుతూ ఆధ్వర్యంలో పార్టీ యొక్క సిద్ధాంతాలు, పార్టీ పార్టీ విధి విధానాలు ప్రజలకు మరియు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మాడుగుల నియోజకవర్గ జనసైనికుల పనితీరు అద్భుతంగా ఉందని, కార్యకర్తలు కలిసికట్టుగా కార్యాలయం ఏర్పాటు చేసుకోవడం అనేది కేవలం జనసేనలోనే జరుగుతుంది అని అన్నారు.  ఆశయాలతో పార్టీని మోసే జనసైనికులు పవన్ కళ్యాణ్ గారికే సొంతం అని చెప్పారు. దేశవ్యాప్తంగా ఎన్నో పార్టీలు ఉన్నా సరే జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది కలగానే మిగిలిపోయింది అని, కానీ పవన్ కళ్యాణ్ గారు దానిని సాధ్యం చేసి చూపించారు అని పునర్ఘటించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శులు శివదత్ గారు, ప్రశాంతి గారు మాట్లాడుతూ క్రింది స్థాయి నుండి వచ్చిన వారిని పవన్ కళ్యాణ్ గారు గుర్తించి పదవులు ఇచ్చారని, ఇది కేవలం జనసేనలో మాత్రమే జరుగుతుంది అని తెలిపారు. ఈ సందర్భంగా జనసేన పార్టీలో భారీగా చేరికలు జరిగాయి. నాలుగు మండలాల నుండి సుమారు 200 మంది పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ శివ శంకరరావు గారి సమక్షంలో జనసేనలో చేరారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి నాయకులు వబ్బిన శ్రీకాంత్, శ్రీమతి పార్వతీ గారు, మాడుగుల నియోజకవర్గ ముఖ్య నాయకులు బోయిదాపు కిరణ్, జి.వి మూర్తి, గట్టా రామారావు, దయా యాదవ్, గుమ్మడి శ్రీరామ్, నాగరాజు, త్రినాధ్, యాళ్ళ ప్రసాద్, గుమ్మడి సంతోష్, భాను మరియు నాలుగు మండలాల జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.

See also  ధర్మవరం మార్కెట్ పై ప్రభుత్వం వైఖరిపై అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ కి వినతిపత్రం అందజేసిన జనసేనపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి