ఆమదాలవలస మున్సిపాలిటీ కసింవలసలో జనసేనపార్టీ జెండా ఆవిష్కరణ

    కసింవలస, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మున్సిపాలిటీ కసింవలసలో స్థానిక జనసేన నాయకులు మధు, రాంబాబుల ఆధ్వర్యంలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ జరిగింది. ముఖ్య అతిథులుగా జనసేనపార్టీ ఆమదాలవలస నియోజకవర్గ ఇంచార్జి పేడాడ రామ్మోహన్, శ్రీకాకుళం నియోజకవర్గ ఇంచార్జీ కోరాడ సర్వేశ్వరావు, పాతపట్నం నియోజకవర్గ ఇంచార్జి గేదల చైతన్య హాజరయ్యారు. అనంతరం కొంత మంది జనసేనపార్టీ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి పార్టీలోకి చేరడం జరిగింది. వారందరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బూర్జ ఎంపిటిసి అభ్యర్థి ఆంపిలి విక్రమ్, కొత్తకోట నాగేంద్ర, గురుప్రసాద్, ఉదయ్, సరుబుజ్జిలి జడ్పీటిసి అభ్యర్థి పైడి మురళి మోహన్, స్థానిక జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు.

See also  గ్రంథాలయాన్ని పట్టించుకోని ఎమ్మెల్యే, అధికారులు