దివ్యాంగుల దినోత్సవ సందర్భంగా దివ్యాంగ ఆశ్రమంలో జనసేనపార్టీ వేడుకలు

దివ్యాంగుల

                కొవ్వూరు ( జనస్వరం ) : ప్రపంచం దివ్యాంగుల దినోత్సవం సందర్బంగా కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలం  జనసేనపార్టీ తరుపున లగడపాటి రామ లక్ష్మమ్మ రమానాయుడు దివ్యాంగుల ఆశ్రమం & వృద్ధాశ్రమంలో వేడుకలు నిర్వహించారు. జనసేన నాయకులు మాట్లాడుతూ జనసేనాని పవన్ కళ్యాణ్ గారి సూచనల మేరకు దివ్యాంగులకు జనసేన పార్టీ భరోసాగా ఉంటుందని వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టమన్నారు. జనసేనపార్టీ దివ్యాంగులకు అండగా ఉంటుందన్నారు. విద్యార్థులకు స్వీట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తిరుగుడుమెట్ట , పోతుల దుర్గాప్రసాద్, అన్నదేవారపేట  చెవురి రాము, చెవురి నాగరాజు, గజ్జరం  అవుడు సీతారామ్, పెద్దేవం కొనగల వెంకట సురేష్  తదితరులు పాల్గొన్నారు. 

See also  ప్రజా సమస్యల పరిష్కారం కోసమే జనసేన పోరాటం : జనసేన నాయకులు గంధం ఆనంద్