బ్రాహ్మణ కోడూరు చిల్డ్రన్స్ హోమ్ నందు జనసేన పార్టీ భగత్ సింగ్ విద్యార్థి నాయకుల ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

భగత్ సింగ్

                  పొన్నూరు నియోజకవర్గం పొన్నూరు మండలంలోని బ్రాహ్మణ కోడూరు చిల్డ్రన్స్ హోమ్ నందు జనసేన పార్టీ తరుపున 75వ స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు జనసేన పార్టీ భగత్ సింగ్ విద్యార్థి నాయకులు షరీఫ్ జనసేన (SJ) గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. భగత్ సింగ్ విద్యార్థి విభాగ నాయకులు మాట్లాడుతూ రాజకీయం డబ్బుతో ముడిపడిన వ్యవస్థ అని రాజకీయలవైపు కన్నెత్తి చూడలంటేనే భయపడేవారిని సైతం ఎంతో మంది యువకులకు ఆవకాశం కల్పించిన పార్టీ జనసేన అని అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే యువతలో ప్రశ్నించేతత్వం రావాలని అప్పుడే అవినీతి జరగకుండా పారదర్శకంగా అభివృద్ది పనులు సక్రమంగా జరుగుతాయని తెలిపారు. నేటి వ్యవస్థ మార్పుకోసం జరుగుతున్న ఉద్యమాల్లో యువతరమే సింహాభాగంగా సాగుతుందని భావి భారత నిర్మాణం యువత చేతుల్లోనే ఉందని గుర్తుచేశారు. దేశానికి యువత ప్రధాన సంపద బలమైన ఆయుధంలాంటి వారని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, భగత్ సింగ్ విభాగ విద్యార్థ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. 

See also  విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న గ్రంథాలయానికి కుర్చీలు పంపిణీ చేసిన జనసేన నాయకుడుమోక్షజ్ఞ చంద్రమౌళి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి