కైకలూరు నియోజకవర్గంలో ప్రారంభమైన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం

     కైకలూరు, (జనస్వరం) : కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గములో క్రియాశీలక కార్యకర్తల సభ్యత్వ నమోదు కార్యక్రమం సోమవారం నాడు కైకలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కొల్లి వరప్రసాద్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ బలోపేతం కోసం, కార్యకర్తలకు అండగా ఉండడం కోసం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పార్టీ ద్వారా ఇన్సూరెన్స్ వర్తించేట్లుగా పార్టీ కార్యక్రమం రూపొందించడం జరిగింది. ఏదైనా ప్రమాద సమయంలో జనసేన పార్టీ కార్యకర్తలకు ఏదైనా ప్రమాదం జరిగితే, ఆ ప్రమాదం జరిగిన 24 గంటలలోపు మన పార్టీకి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ కి కానీ నియోజకవర్గ నాయకులు గానీ సమాచారం అందించిన వెంటనే మెడికల్ ఖర్చుల నిమిత్తం సుమారుగా 50,000 వేల రూపాయలు కానీ, ఏదైనా అనుకోని సందర్భంలో దుర్ఘటన జరిగి ఆ కుటుంబంలో విషాదం జరిగితే పార్టీ ద్వారా క్రియాశీలక సభ్యత్వం కార్యకర్తగా కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ వచ్చే విధముగా సభ్యత్వ కార్యక్రమాన్ని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేశారు. కార్యకర్తలకు వారి కుటుంబాలకు అండగా ఉండాలని పెద్ద మనసుతో ఆయన  ప్రతి ఒక్క కార్యకర్తకు ఆయన సొంత డబ్బులు వెచ్చించి ఇన్సూరెన్స్ చేయించడం జరుగుతుంది. జనసేన పార్టీలో ఉండే ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నానని అన్నారు. కైకలూరు నియోజకవర్గంలో అతిపెద్ద సంఖ్యలో కార్యకర్తల సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయాలని జనసేన పార్టీ కార్యకర్తలు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ సభ్యత్వం ఎలా పొందాలని, కొంతమంది కార్యకర్తలకు కొన్ని సందేహాలు ఉన్నాయి. దీనికి పార్టీ నాలుగు మండలాల్లో ఈ సభ్యత్వం సంబంధించినటువంటి క్రియాశీలక సభ్యత్వం వాలంటీర్లు నియమించడం జరిగింది. అదేవిధంగా నియోజకవర్గ ముఖ్య నాయకులతో పాటు మండల అధ్యక్షులు పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతోంది. కావున ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క కార్యకర్త పాల్గొని దీన్ని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు.

See also  జనసేనపార్టీ బలోపేతమే లక్ష్యం : పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయడమే ధ్యేయం : జనసేన నాయకులు యుగంధర్ పొన్నాల