ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా జనం కోసమే జనసేన పాదయాత్ర

పాదయాత్ర

      మదనపల్లి ( జనస్వరం ) : ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా 102 రోజులుగా జనసేన పార్టీ దక్షిణ రాయల కోస్తా సంయుక్త పార్లమెంటరీ సమన్వయ కర్త, స్టేట్ ఫైనాన్స్ కమిటీ మెంబర్ మైఫోర్స్ మహేష్ చేపట్టి జనం కోసమే జనసేన పాదయాత్రక ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని జనసేన పార్టీ దక్షిణ రాయల కోస్తా సంయుక్త పార్లమెంటరీ సమన్వయ కర్త డాక్టర్ మైఫోర్స్ మహేష్ పేర్కొన్నారు. శుక్రవారం మదనపల్లె టౌన్ అమ్మచెరువుమిట్ట వద్ద జనసేన పార్టీ నాయకులు గోపాలకృష్ణ, రమణ ఆద్వర్యంలో ఇంటింటా తిరుగుతూ జనసేన పార్టీకి‌ ఓటు వేసి పవన్ కళ్యాణ్ ను సిఎం చేయాలని అభ్యర్థించారు.‌ ఈ సందర్భంగా కాలనీలో నెలకొన్న సమస్యలను మైఫోర్స్ మహేష్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ప్రతి సమస్య రాసుకుని సంబందిత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కారానికి కృషి‌చేస్తామని హామి ఇచ్చారు. అవినీతి, అక్రమాలు లేని‌ ఏకైక నాయకుడు, తన సొంత సంపాదనలో పేదలకు సాయం అందించే ఏకైక వ్వక్తి పవన్ కళ్యాణ్ మాత్రమే అన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో జనసేన పార్టీకి ఓటు వేసి గెలిపించాలని తద్వారా సుపరిపాలన సాధ్యమవుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు‌ శంకర్, జనసేన పార్టీ వీర మహిళలు శోభ, సునీత, పెద్ద సంఖ్యలో స్దానిక యువకులు పాల్గొన్నారు.

See also  ప్రజల కోసమే నా జీవితం అంకితం : యుగంధర్ పొన్న