పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వారోత్సవాల సందర్భంగా జనసేన NRI సేవా సమితి కువైట్ వారి ఆధ్వర్యంలో 24వ రోజు సేవా కార్యక్రమాలు

జనసేన NRI సేవా సమితి కువైట్

              జనసేన NRI సేవా సమితి కువైట్ ఆధ్వర్యంలో జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలో భాగంగా 24వ రోజు చిత్తూరు జిల్లా తిరుపతిలో జరిగింది. జనసేన ఎన్నారై సేవా సమితి కువైట్ గౌరవ సభ్యులు చిరంజీవి రామచంద్రనాయక్ సాయం నరసింహులు ఇంతియాజ్ సహకారంతో చిత్తూరు జిల్లా తిరుపతి చెందిన రమావత్ చిన్ని కిష్టయ్య నాయక్ నిరుపేద విద్యార్థి కి 20 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది.  కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా విచ్చేసిన జనసేన నాయకుల తిరుపతి జనసేన పార్టీ ఇన్చార్జ్ కిరణ్ రాయల్, రాజారెడ్డి, రాజేష్ యాదవ్, మధు చేతుల మీదుగా ఆర్థిక సహాయం చేశారు. కిరణ్ రాయల్ మాట్లాడుతూ  జనసేన ఎన్నారై సేవా సమితి కువైట్ చేస్తున్న సేవలు ఎంతో అభినందనీయని, ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీ రామచంద్ర నాయక్, ఉపాద్యక్షులు శ్రీ పగడాల అంజన్ కుమార్, నాయకులు శ్రీ కంచన శ్రీకాంత్, శ్రీ మాదాసు నరసింహ, దండు చంద్రశేఖర్, ఇంతియాజ్, నరసింహులు, రామచంద్రనాయక్, చిరంజీవికు తన అభినందనలు తెలిపారు. సిటీ అధ్యక్షుడు రాజారెడ్డి మాట్లాడుతూ కువైట్ లో ఉంటూ మాతృభూమికి, జనసేన బలోపేతానికి ఎంతో కృషి చేస్తున్న జనసేన ఎన్నారై సేవా సమితి కువైట్ సభ్యులందరూ ఎంతో‌ ధన్యులని, ఈ సందర్భంగా దాత లు ఇంతియాజ్ రాంచందర్ నాయక్, చిరంజీవి, సాయం నరసింహులు గారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. యువ నాయకులు మధు మాట్లాడుతూ ‌కోవిడ్ లాక్ డౌన్ నాటి నుండి నేటివరకూ అవిశ్రాంతంగా సేవలు అందించడం ఎంతో స్ఫూర్తిదాయకం అని ఎన్నారై సేవా సమితి కువైట్ వారి‌ సేవలను కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవలు కొనసాగించాలని ఆకాంక్షించారు. 

See also  స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి : జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి కూసంపూడి శ్రీనివాస్‌