పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వారోత్సవాల సందర్భంగా జనసేన NRI సేవా సమితి కువైట్ వారి ఆధ్వర్యంలో 20వ రోజు సేవా కార్యక్రమాలు

జనసేన NRI సేవా సమితి కువైట్

       జనసేన NRI సేవా సమితి కువైట్ ఆధ్వర్యంలో జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలో భాగంగా 20వ రోజు చంద్రగిరి నియోజకవర్గం దామలచెరువు వాసుకి ఆర్థిక సహాయం చేశారు. జనసేన ఎన్నారై సేవాసమితి గౌరవ సభ్యులు కొరివి సుబ్బ నరసయ్య, కోల మురళి, కాంచన శ్రీకాంత్, గంగాధర్ రమేష్ వీరందరి సహాయంతో దామలచెరువు గ్రామస్తునికి covid 19 మరియు బ్రెయిన్ వ్యాధితో బాధపడుతుంటే 20 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా జనసేన కార్యదర్శి నజీర్ గారు విచ్చేసి ఆయన చేతుల మీద వాళ్ల కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. అందరికి ఎంతో గొప్ప మనసుతో మానవ సేవే మాధవ సేవ అని భావించి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న జనసేన NRI సేవా సమితి సభ్యులకు, దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.  అలాగే జనసేన NRI సేవా సమితి అధ్యక్షులు రామచంద్రనాయక్, అంజన్ కుమార్ గారికి కాంచన శ్రీకాంత్ గారికి చంద్రశేఖర్ గారికి మాదాసు నరసింహులు గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సోహెల్, దినేష్, వాసు నవ్వు మూన్, నాగూర్, షాజహాన్, మన్సూర్ రహమతుల్లా, సుబ్రహ్మణ్యం మరియు జనసేన కార్యకర్తలు పాల్గొన్నా రు. 

See also  సీఎం జగన్ బటన్ ని రిపేర్ చేయాలి : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి