డ్రైనేజి సమస్యలను పరిష్కరించాలని అధికారులకు వినతిపత్రాన్ని అందించిన జనసేన నాయకులు

జనసేన

          పెనుకొండ ( జనస్వరం ) : నియోజకవర్గం రొద్దం మండలంలోని రెడ్డిపల్లి గ్రామంలో డ్రైనేజి సమస్యలను పరిష్కరించాలని జనసేన పార్టీ రొద్దం మండల అధ్యక్షులు U. గంగాధర్ ఆధ్వర్యంలో MPDO గారికి వినతిపత్రం అదించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ వర్షం వస్తే డ్రైనేజీ వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తంగా తయారయ్యి మురుగు నీరు పారుతోందని అన్నారు. దీనివలన స్థానిక ప్రజలు అనారోగ్యపాలవుతున్నారని అన్నారు. MPDO మాట్లాడుతూ సమస్య పరిష్కరించే విధంగా బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు రొద్దం గంగాధర్, హరీష్, తిరుపతి, వెంకటేష్, నాగభూషణ, చిరంజీవి, విజయకుమార్, నరేష్, చంద్రశేఖర్, పాల్గొన్నారు. 

See also  వర్షాల వల్ల దెబ్బతిన్న మొక్కజొన్న పంట రైతులకు నష్టపరిహారం అందించాలి : జనసేన నాయకురాలు కాంతిశ్రీ