ప్రమాదవశాత్తు గాయపడిన జనసైనికుడికి క్రియాశీలక ఇన్సూరెన్స్ అందించిన జనసేన నాయకులు

ఇన్సూరెన్స్

        రాజోలు ( జనస్వరం ) : మత్స్యకార అభ్యున్నతి యాత్రలో భాగంగా రాజోలు నియోజకవర్గం చింతలపల్లి గ్రామంకు చెందిన క్రియాశీలక కార్యకర్త సోమిశెట్టి శ్రీను ప్రమాదవశాత్తు గాయపడ్డాడు. అతన్ని పరామర్శించి జనసేన పార్టీ తరఫున వర్తించే మెడికల్ ఇన్సూరెన్స్ చెక్కు ను 50,000 PAC చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ గారు రాజోలు వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనందరాజు చేతులమీదుగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మలికిపురం మండలం ఎంపీపీ మేడిచర్ల సత్యవాణి, రాజోలు జనసేన పార్టీ మండల అధ్యక్షుడు సూరి శెట్టి శ్రీను, గడ్డం మహాలక్ష్మి ప్రసాద్, పినిశెట్టి బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

See also  జనసేన పార్టీ తెలంగాణ ఇంచార్జ్‌ శ్రీ శంకర్‌ గౌడ్‌ గారిని కలిసిన తెలంగాణ రాష్ట్ర 26 బీసీ కులాల JAC