అమూల్య స్వచ్ఛంద సేవా సంస్థ లో అన్నదానం చేసిన జనసేన నాయకులు

అమూల్య స్వచ్ఛంద సేవా సంస్థ లో అన్నదానం చేసిన జనసేన నాయకులు        

          అమూల్య స్వచ్చంద సేవా సంస్థ వ్యవస్థాపకులు టోనీబాబు గారు స్వర్ణదీపం చారిటబుల్ ట్రస్ట్ దివ్యాoగుల వసతి గృహం లో పొన్నవోలు సుశీలమ్మ గారి మొదటి వర్ధoతి సందర్భంగా వారి మొదటి కుమారుడు పొన్నవోలు మధుసూదన్ రెడ్డి గారు వారి అర్దాంగి పొన్నవోలు సునీతమ్మ గారు, రెండవ కుమారుడు సుధాకర్ రెడ్డి గారు, అలాగే మనుమడు పొన్నవోలు విజయకృష్ణా రెడ్డి గారు వారి సౌజన్యం తో అన్నదానం చేశారు. ఈ సందర్బంగా జనసేన నాయకులు టోనీబాబు గారు మాట్లాడుతూ నా చిన్నతనం నుండి నేను చేసే సేవలకు నాకు సహాయం అందిస్తూ నన్ను ముందుకు నడిపించిన సేవామూర్తి, సహనశీలి, మానవతామూర్తి మా అమ్మమ్మ సుశీలమ్మ గారి ఆత్మ శాంతించాలని, ఇంకా తను చేయబోయే ప్రతి కార్యక్రమంలోను కుటుంబ సభ్యుల సహాయ, సహకారాలు అందిస్తున్నందుకు ధన్యవాదములు తెలిపారు. అలాగే స్వర్ణ దీపం కు తన వంతు సహాయ, సహకారాలు అందిస్తామని తెలిపారు. స్వర్ణదీపం చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్స్ ఉమా మహేశ్వరి, రఫి మాట్లాడుతూ టోనీబాబు గారి సేవలు అనిర్వచనీయం అని, 7 సంవత్సరాలనుండి స్వర్ణదీపం చారిటబుల్ ట్రస్ట్ కు కష్టసుఖాలు లో తోడుంటూ ఎందరికో భోజన, వసతులను అందించడానికి సహాయం అందిస్తున్న టోనీబాబు గారికి కృతజ్ఞతలు తెలిపారు.

See also  ప్రజారంజక పాలనే మా లక్ష్యం : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి