జనసేన రైతుభరోసా యాత్రకు మద్దతుగా రైతులకు అవగాహన కల్పించిన జనసేన నాయకులు

జనసేన రైతుభరోసా యాత్ర

     విజయనగరం ( జనస్వరం ) : జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తలపెట్టిన జనసేన రైతు భరోసా యాత్రకు మద్దతుగా విజయనగరం జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం, గంటస్థంభం వద్ద కూరాకుల రైతులకు, పవన్ కళ్యాణ్ చనిపోయిన కౌలురైతులకు మూడువేలమందికి ఒక్కొక్కరికి లక్ష చప్పున ముప్పై కోట్లు ఇస్తున్నారని జనసేన పార్టీ సీనియర్ నాయకులు వంక నరసింగరావు, దంతులూరి రామచంద్ర రాజు కూరాకుల రైతులకు వివరించారు. అనంతరం టీం పిడికిలి వారు అందించిన గోడ పత్రికలను జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు(బాలు), ఎర్నాగుల చక్రవర్తి గంటస్థంభం, మున్సిపల్ కార్యాలయం ప్రాంతంలో అంటించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు లోపింటి కళ్యాణ్, చెల్లూరి ముత్యాల నాయుడు పాల్గొన్నారు.

See also  పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలలో భాగంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన జగ్గయ్యపేట జనసేన నాయకులు