జనసైనికుడి కుటుంబాన్ని పరామర్శించిన జనసేన నాయకులు

జనసేన

          అరకు ( జనస్వరం ) :  అనంతగిరి మండలంలో చిట్టం మురళి ఆధ్వర్యంలో జనసేనపార్టీ నాయకులు కొత్తూరు గ్రామంలో పల్లి కనకరావు అనే జన సైనికుడు జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వము తీసుకున్నాడు అయితే ప్రమాదవశాత్తు చెట్టు మీద నుంచి కింద పడి మరణించడం జరిగింది. అనంతగిరి మండలం జనసేన పార్టీ నాయకులు నియోజవర్గం స్థాయి నాయకులు కొత్తూరు గ్రామంలో ఆ బాధితురాలిని పరామర్శించడం జరిగింది. ఆ కుటుంబానికి జనసేనపార్టీ తరుపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొర్రా ప్రవీణ్ కుమార్,కొనేడీ లక్ష్మణరావు, బంగారు రామదాసు, ముల్లంగి శ్రీనివాస్ రెడ్డి, సంతోష్ సింగ్అ, నంతగిరి మండల నాయకులు కొర్రాచెట్టి విజయ్ కుమార్, రాజా తదితరులు పాల్గొన్నారు.

See also  శ్రీకాళహస్తిలో జనసేన ఇంఛార్జి వినుత కోటా ఇంటింటికీ ప్రచారం